Monday, December 7, 2009
ప్రేమ విశ్వజనీనం
ప్రేమే కల్పనైతే .. ఈ అనుబంధాలన్నీ శూన్యమే!
యువతీ యువకులు ప్రేమనుకునే ఆకర్షణ మాత్రమే కల్పన.
అవసరార్దం నటించే ప్రేమే కల్పన. నిజమైన ప్రేమ కల్పన కానేరదు.
శారదామాయిని జగజ్జననిగా భావించిన రామకృష్ణుడి భక్తి ప్రేమ కల్పనా?
కృష్ణునిలో ఆత్మసంధానం చేసిన మీరా ప్రేమ కల్పనా?
నిద్రాహారాలు మాని శ్రీ రాముని కొలిచిన సౌమిత్రి ప్రేమ కల్పనా?
తాను తినక పిల్లలకు పెట్టే పక్షి తల్లి ప్రేమ కల్పనా?
ఈ యాంత్రిక జీవనంలో ప్రేమలు కల్పనేనేమో అనే భ్రమ ఉదయిస్తుంది.
ఆత్మీయత లేని ప్రేమ కంట తది పెట్టిస్తుంది. ప్రేమ లేని నాడు బ్రతుకే నిరర్దకం..
ప్రేమ విశ్వజనీనం.
ఈ మధ్య కొన్ని బ్లాగుల్లో వచిన "ప్రేమే కల్పనైతే" అనే దానిపై మా అమ్మ తెలిపిన అభిప్రాయం ఇక్కడ టపాలో పెడుతున్నను..
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ఈ యాంత్రిక జీవనంలో ఆశించిన ఆత్మీయతలు కరువైనప్పుడు..ప్రేమలు కల్పనేనేమో అనే భ్రమ ఉదయిస్తుంది అని రాసుంటే ఇంకా బాగుండేది
అమ్మ కదా అందుకే అంత బాగా చెప్పారు.
శివ గారు: అందించడమే కానీ ఆశించడం తెలియనిదే నిజమైన ప్రేమకదా? :)
నిజమే మరి. ప్రేమంటే ప్రేమికుల ప్రేమనే దృష్టిలో పెట్టుకుంటే.. నేడు అది కల్పనలానే అనిపిస్తుంది మరి. ప్రేమనేది విశ్వవ్యాప్తమైనది. చుసే మనసుంటే అది నీలో నాలో, అంతెందుకు పశు పక్ష్యాదులలో కూడా కనిపిస్తుంది.
అమ్మా మీరు చాలా బాగా రాస్తున్నారు. మీ రచనలు మరిన్ని వెలుగు చూడాలని ఆకాంక్షిస్తున్నాను. :)

mee amma gaaru chala baga chepparu,
nijamea ee madya preamaloa nammakam kamtea kalpanea ekkuvaga kanipistumdi.
Post a Comment