అక్బరు చక్రవర్తి ఓ రోజు ఉదయం వాహ్యాలికీ బైలుదేరాడు, తనకి తెలీకుండానే చాలా దూరం సాగిపోయాడు. అంతలో ఒక చక్కని పాట అతని చెవినపడింది, మంత్రించినట్టు అలా నిలబడిపోయాడు. చుట్టూ చూసేసరికి దూరంగా ఒక హరిదాసు తన్మయుడై అర్థనిమిలిత నేత్రాలతో గానం చేస్తూ కనపడ్డాడు. అక్బరుకు చాల ఆశ్చర్యం కలిగింది, తను ఎప్పుడు అంత మధురమైన గానం వినలేదు. రాజ భవనానికి చేరగానే తన ఆస్థాన గాయకుడైన తాన్ సేన్ కు కబురు చేసి రప్పించి " మీరూ గొప్ప గాయకులే కదా , అంత కదిలించే పాట ఎప్పుడూ ఎందుకు పాడలేదు?" అని తను విన్న గానం గురించి చెప్పాక అడిగాడు అక్బరు. అప్పుడు తాన్ సేన్ నిట్టూర్చి " ఏముంది ప్రభూ నేను మిమ్మల్ని రంజింపచేయడానికి పాడతాను ఆ హరిదాసు భగవంతుని రంజింపచేయడానికి పాడుతున్నాడు, అందుకే అతని పాటకు అంత మాధుర్యం" అన్నాడు.
ధన్యవాదములు

.jpg)