Tuesday, January 5, 2010

అందరికీ తెలియని అద్బుతమైన బ్లాగులు ..

మన బ్లాగులోకంలో కొందరికి మాత్రమే తెలిసిన అద్భుతమైన మంచి బ్లాగులు ఉన్నాయి, నేను తెలుసుకున్న కొన్నిటి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ టపాలో పెడుతున్నాను. బ్లాగు రచయితల అనుమతి లేకుండా పెడుతున్నందుకు మన్నించగలరు. వాటిని తప్పకుండా చూసి మీ అభిప్రాయం తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

బ్లాగు శీర్షిక:Colorful Moments of my (he)art...
"Art is God's exceptional gift in one's life and one should continue doing it." "కళ మనిషికి దేవుడిచ్చిన అరుదైన వరం. దాన్ని అనునిత్యం సాధన చేస్తూనే ఉండాలి." – Giridhar Pottepalem
బ్లాగు రచయిత: గిరిధర్

బ్లాగు శీర్షిక: అంతర్జాల బాలశిక్ష
నేటి తరం బాలలకు పాత తరం విషయాలు
బ్లాగు రచయిత: మైత్రేయి

బ్లాగు శీర్షిక:పెద్దలు చెప్పిన మంచి మాటలు ఉన్న నిజాన్ని పెద్దలు రక రకాలు గా చెప్పారు - వారి మాటల్లోనే కొంత ఈ బ్లాగు లో..
బ్లాగు రచయిత: ఫ్రసాద్

బ్లాగు శీర్షిక:రెప్పల వెనకాల. . . पलकों के पीछे నాలో! భావాలే తప్ప - బంధాలుండవు.భాధ్యతలే తప్ప - భారాలుండవు . అలంకారాలే తప్ప- అహంకారాలుండవు .స్పందనలే తప్ప- సాధింపులుండవు . పలుకులే తప్ప - పారవశ్యాలుండవు. మెరుగులే తప్ప - మెరుపులుండవు . ఊహలే తప్ప - ఉద్దేశ్యాలుండవు . నాలో నెను తప్ప - ఎవ్వరిలో ఉండను. -satya
బ్లాగు రచయిత: సత్య

బ్లాగు శీర్షిక: భద్రాచల నరసింహ
"నరహరి చరణము నమ్మిన వానికి నరక భయము లేదు ఎన్నటికి"
బ్లాగు రచయిత: శ్రీ భద్రాచల నరసింహ స్వామి సేవకులు

4 comments:

శివ చెరువు said...

Good work.

మైత్రేయి said...

thanks for adding my blog in the list.

కొత్త పాళీ said...

మంచి విషయం. ధన్యవాదాలు.
మీకు నచ్చిన బ్లాగుల్ని బ్లాగర్లోని విడ్జెట్లు ఉపయోగించి ఒక లిస్టుగా మీ బ్లాగులోనే కనబడేట్టు పెట్టుకోవచ్చు.

Giridhar Pottepalem said...

నా బ్లాగ్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం.