చల్లని తల్లి
చల్లని తల్లి సీతమ్మ బంగారమైన రచనలు, సేకరణలు, సంకలనాలు ఈ బ్లాగులో పెడుతున్నాను.
Thursday, March 3, 2011
కలకాలం నిలచిపోతుంది!
ఒక చల్లని చిరునవ్వు,
సభ్యత నిండిన ఆహ్వానం ,
మర్యాదతో కూడిన గౌరవం,
అందమైన ఒక తీయని మాట మాట్లాడితే చాలు,
మీ మంచితనం తో నిండిన రూపం కలకాలం నిలచిపోతుంది ఎవరి మనస్సులలోనైన!
1987
లో ప్రచురితమైన ఒక వార పత్రిక నుండి సేకరించబడినది.
ధన్యవాదములు
Tuesday, March 1, 2011
సేవకు, పూజకు భేదమేమిటి?
అత్యధిక ఆదరభావంతో చేసేది
పూజ
,
ఆదరం తక్కువైనది
సేవ
,
జీతం తీసుకుని పొట్ట కోసం చేసేది
పని
,
ఏ పనినైనా పరహితం కోరి భగవత్ పూజగా భావించి చేయడం మానవత్వపు మహోన్నత ఆదర్శం అవుతుంది.
1986
లో ప్రచురితమైన ఒక మాస పత్రిక నుండి సేకరించబడినది.
ధన్యవాదములు
Wednesday, October 27, 2010
దేవుడిచ్చిన వరం
అంతులేని నీరున్నా ముత్యపు చిప్పకి
స్వాతి చినుకే దేవుడిచ్చిన వరం
ఆమని కొంగ్రొత్త చిగుళ్ళే
రాగాల కోకిలమ్మకి దేవుడిచ్చిన వరం
విత్తులు చల్లేందుకు కళ్ళలో
ఒత్తులేసుకుని చూచే రైతుకు తొలకరే దేవుడిచ్చిన వరం
పొద్దున్నే పృధ్విని తన పూలతో పూజించే
పారిజాతం పుడమి తల్లికి దేవుడిచ్చిన వరం
Monday, October 11, 2010
ప్లే క్లాసుల పంజరం..
అమ్మ ముద్దులు..
నాన్న మురిపాలు..
అమ్మమ్మ జోలలు..
నానమ్మ కథలు..
తాతయ్య గారాలు..
మామయ్య ముచ్చట్లు..
ఇవన్నీ వదిలి
ప్లే క్లాసుల పంజరంలో
నవ్వు, ఏడుపు,
నడక, ఆట, పాటలన్నీ బెదురుబెదురుగానే
అలసి సొలసి
బుజ్జి వయసులోనే మోయలేని భారం
ఏ గ్రేడుల పందేరం
వస్తే మోదం.. లేకుంటే ఖేదం..
అందమైన ఆప్యాయతల హరివిల్లు పై
ఊయలలూగాలని నీకున్నా, కుదరదే!!
Wednesday, October 6, 2010
అలసి సొలసిన అమ్మ!
వెన్నెల తరకల్ని మురిపించే నవ్వులతో
ఊ.. ఉంగా అంటూ చేతులాడిస్తూ
కోడికూత ముందే చిట్టి పాదాల్తో తంతూ
వటపత్రశాయిలా కాలివేలు చేత్తో పట్టి నోట పెట్టుకుంటూ
బోసినవ్వుల తేనెల విందు చేస్తూ రాగాలు తీసే కన్నా..
నీతో పాటే లేచి రాగాల ఊసులాడి
ఆనందామృతంలో తేలిపోవాలని ఉన్నా
ఈ నవయుగపు పందేరంలో
ఆఫీసుపనులూ, ఇంటిపనులూ, నీ పనులతో
అలసి సొలసిన అమ్మ
మగత నుండి తేరుకోలేదు, నీతో ఆడుకోలేదు .. కన్నా..
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)