అంతులేని నీరున్నా ముత్యపు చిప్పకి
స్వాతి చినుకే దేవుడిచ్చిన వరం
ఆమని కొంగ్రొత్త చిగుళ్ళే
రాగాల కోకిలమ్మకి దేవుడిచ్చిన వరం
విత్తులు చల్లేందుకు కళ్ళలో
ఒత్తులేసుకుని చూచే రైతుకు తొలకరే దేవుడిచ్చిన వరం
పొద్దున్నే పృధ్విని తన పూలతో పూజించే
పారిజాతం పుడమి తల్లికి దేవుడిచ్చిన వరం
2 comments:
చాలా బాగుంది.
బాగుంది మరి కొంత రాసి వుండొచ్చేమో అనిపించింది
దీపావళి శుభాకాంక్షలు
శివ చెరువు
Post a Comment