Sunday, October 16, 2011

బిల్వప్రశస్తి


మారేడు లేదా బిల్వము. Bael (Aegle marmelos)
మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది. దలము అనగ జంటగా ఉన్న ఆకులు.

బిల్వప్రశస్తి:
మన పురాణాలలొ బిల్వమునకు అత్యంత ప్రాసస్త్యం ఉంది.
హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం.
బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని బావించెదరు.
బిల్వార్చన (మారేడుదళముతొ పూజించడం) శివునికి అత్యంత ప్రీతికరం అని ప్రసిద్ది.

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు అని పురాణములలో పెర్కొనబడినది.

మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంద్యాసమయము, రాత్రి వేళలందు, శిరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు కనుక ఈ దళాలను ముందు రోజు కోసి బభద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.

ఔషదగుణం :
మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు.
ఆయుర్వేదములో వాడు దశమూలములలో దీని వేరు ఒకటి.
మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.

మారేడు గురించి మరిన్ని వివరాలకై ఈ క్రింది లింకులు చూడండి:



Note: The photo credit goes to the original photographer and source, it will be removed in case of any objections. Thank you.

1 comment:

రసజ్ఞ said...

మీరు దీని గురించి ప్రస్తావిస్తుంటే నాకు బిల్వాష్టకం గుర్తుకొచ్చింది! అలానే లక్ష బిల్వార్చన కూడా ఎంతో మంచి ఫలితాలని ఇస్తుంది అని చెప్పారు! ఎన్నో చక్కని విషయాలను ప్రస్తావిస్తున్నారు! బాగుంది మీ బ్లాగు ఇంచుమించు సగం పైగా టపాలన్నీ చదివేశా! ఒక మంచి బ్లాగు చదివిన భావన!